Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్యాన్సర్ రోగిపై దగ్గిన మహిళకు.. 30 రోజుల జైలు శిక్ష!

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో కావాలని క్యాన్సర్ రోగిపై దగ్గిన ఓ మహిళకు అక్కడి స్థానిక న్యాయస్థానం 30 రోజుల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది జూన్‌లో ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలో గల పీర్ 1 స్టోర్‌కు వెళ్లిన డెబ్రా హంటర్ అనే మహిళ ఈ నిర్వాకానికి పాల్పడింది. స్టోర్‌కు వచ్చిన ఓ క్యాన్సర్ రోగిపై హంటర్ కావాలని దగ్గడం చేసింది. కరోనా విజృంభణ కొనసాగుతున్న ఆ సమయంలో హంటర్ ఇలా చేయడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో, పొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో హంటర్‌ను జూన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఒకరోజు జైలులో కూడా ఉంది. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైంది. తాజాగా ఈ కేసు జాక్సన్‌విల్లే కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో దోషిగా తేలిన హంటర్‌కు న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్ష, 500 డాలర్ల(రూ.37వేలు) జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.   

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement