ముదురుతున్న పోడు వివాదం

ABN , First Publish Date - 2021-09-18T06:07:57+05:30 IST

ముదురుతున్న పోడు వివాదం

ముదురుతున్న పోడు వివాదం

చర్చనీయాంశంగా ఫారెస్టు అధికారులు, రైతుల ఘర్షణ

పరస్పరంగా పోలీసులకు ఫిర్యాదు  

 కాకతీయఖని, సెప్టెంబరు 17: భూపాలపల్లి మండల పందిపంపుల గ్రామంలో పోడు రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య గురువారం చోటు చేసుకున్న ఘర్షణ చర్చనీయాంశంగా మారింది. తాము సాగుచేసుకుంటున్న పత్తి పంటను ఫారెస్టు అధికారులు తొలగించడమే కాకుండా తమను చితకబాదారని రైతులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ తరఫున పది హెక్టార్లలో పండ్ల మొక్కలు వేయగా రైతులు వాటిని తొలగించి పత్తి పంటలు వేయడమే కాకుండా అక్కడికి వెళ్లిన తమపై కత్తితో దాడికి యత్నించడమే కాకుండా పెట్రోల్‌ పోశారని అటవీ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పందిపంపుల గ్రామంలో కొమ్ము మంజూల, మహేష్‌ దంపతులు సర్వేనంబర్‌ 34లోని ఆరెకరాల్లో పంటలు వేసుకుంటున్నారు. అయితే.. ఇది అటవీ భూమి అంటూ ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఈ భూమి సహా మొ త్తం పదెకరాల్లో  ఇటీవల పండ్ల మొక్కలు పెట్టారు. దీనిపై రైతులు అభ్యంత రం వ్యక్తం చేశారు. ఫారెస్టు అధికారులు పెట్టిన పంట్ల మొక్కలను తొలగించారు. ఆ భూమిలోని ఆరెకరాల్లో కొమ్ము మహేష్‌ కుటుంబం మళ్లీ పత్తి పం ట వేసింది. ఈ క్రమంలో క్షేత్ర పరిశీలన కోసం గురువారం పందిపంపుల గ్రామాన్ని సందర్శించిన ఆజంనగర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి దివ్య ఇది గమనించారు. తన సిబ్బందితో కలిసి రైతు వేసిన పత్తి మొక్కలను తొలగించారు. ఇది తెలుసుకున్న మహే్‌షతోపాటు ఇతర రైతులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. రైతు కొమ్ము మహేష్‌ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన అత డి బావమరిది గోపనవేని మహేందర్‌ ఫారెస్టు అధికారులపై తీవ్ర ఆగ్రహాని కి గురయ్యాడు. ఈ క్రమంలో ఫారెస్టు అధికారులు, రైతుల మఽధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతులు పెట్రోల్‌, పురుగుమందుల డబ్బాలతో ఆందోళనకు దిగారు. ఒక దశలో దివ్యపై, ఆమె వాహనంపై పెట్రోల్‌ పోసి, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని ఫారెస్టు అధికారులు అంటున్నారు. దూదేకులపల్లి రేంజ్‌ వెన్నెలమడుగు సెక్షన్‌ అధికారి మోహన్‌పైనా దాడిచేశారని చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి ఎఫ్‌ఆర్‌వో దివ్యను, సిబ్బందిని చికిత్స నిమిత్తం భూపాలపల్లి పీహెచ్‌సీకీ  తరలించారు. ఎఫ్‌ఆర్వో దివ్యపై రైతులు ఏకపక్షంగా దాడికి దిగారని, ఘర్షణలో ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసు పోయిందని డీఎ్‌ఫవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. రైతులు మాత్రం తాము దాడికి పాల్పడలేదని చెబుతున్నారు. గతం లో కూడా తమ పంటలను  నాశనం చేయడంతో జిల్లా ఫారెస్ట్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశామని, ఇటీవల 10 ఎకరాల్లో చేతికొచ్చిన పత్తి పంటను ధ్వంసం చేయడం మూలంగా సుమారు రూ.10లక్షలు నష్టం వాటిల్లిందని తెలిపారు. గురువారం ఎఫ్‌ఆర్‌వో దివ్య తమ పంటలను నాశనం చేయడం తో ఆవేదనతో పెట్రోల్‌, పురుగు మందు డబ్బాలతో నిరస వ్యక్తం చేశామన్నారు. ఈ  క్రమంలో ఎఫ్‌ఆర్‌వో తమ వద్ద నుంచి బాటిల్‌ను లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు పెట్రోల్‌ ఒలికి అక్కడున్న పలువురిపై, వాహనంపైన పడిందని అంటున్నారు. ఫారెస్టు అధికారులు తమను వాహనంలోకి ఎక్కించి దూదేకులపల్లి రేంజ్‌ కార్యాలయానికి తీసుకెళ్లి కర్రలతో చితకబాదారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్రమంలో క్షేత్ర పరిశీలన కోసం వెళ్లిన తమను కొమ్ము మంజూల, కొమ్ము మహేష్‌, గోనబోయిన ఓదెలు, గోనబోయిన మహేందర్‌ తదితరులు పెట్రోల్‌, కత్తితో దాడి చేశారని రేంజర్‌ దివ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులు అందాయని, విచారణ చేపడుతున్నామని భూపాలపల్లి ఎస్సై నరేష్‌ తెలిపారు. ఈ ఘటనపై ఇంకా ఎలాంటి కేసు నమోదు కాలేని పేర్కొన్నారు.


Updated Date - 2021-09-18T06:07:57+05:30 IST