Abn logo
Nov 30 2020 @ 01:17AM

కొత్త జీవితాన్ని ఆరంభించండి!

ఇష్టమైన వాళ్లు దూరమైతే బాధగానే ఉంటుంది. అయితే ఆ విషయం గురించే ఆలోచిస్తూ కుంగిపోకూడదు. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్‌ అయినప్పుడు కుంగిపోకుండా కొత్త జీవితం ప్రారంభించాలి. మీ స్థానంలో మరో వ్యక్తి ఉన్నంత మాత్రాన అదే ఆలోచనల్లో ఉండిపోకూడదు.


  1. ప్రతి బంధం ప్రత్యేకమైనది, విలక్షణమైనది. మీ స్థానంలోకి ఎవరో కొత్త వ్యక్తి వచ్చినంత మాత్రాన మీ స్థానాన్ని వాళ్లు భర్తీ చేశారని అనుకోవద్దు. 
  2. పాత జ్ఞాపకాలు తొందరగా చెరిగిపోవు. ఆ జ్ఞాపకాలున్నా వాటితో భవిష్యత్తును గందరగోళానికి గురిచేయవద్దు. జీవితంలో ముందుకెళ్లడం ఆపొద్దు.
  3. తప్పు ఎవరిదైనా ఆ సంఘటనల నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. అప్పుడే మీరు మరింత దృఢంగా మారతారు. 
  4. జరిగిందే ఆలోచిస్తూ కూర్చోకూడదు. వాళ్లు ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తూ కూర్చోవడం మూర్ఖత్వమే అవుతుంది. అనవసర విషయాలపై సమయాన్ని వృథా చేసుకోకూడదు. ఆలోచనలను నియంత్రించుకోవాలి.