Abn logo
Aug 1 2021 @ 16:06PM

Australia: చీఫ్ సెలక్టర్‌గా మాజీ కెప్టెన్

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీని జాతీయ జట్టు చీఫ్ సెలక్టర్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో పనిచేసిన ట్రెవర్ హాన్స్ స్థానంలో ఆయన పగ్గాలు అందుకోనున్నట్టు ఆసీస్ బోర్డు తెలిపింది. ట్రెవర్ రెండుసార్లు జాతీయ సెలక్షన్ ప్యానల్ చీఫ్‌గా పనిచేశాడు. బెయిలీ ఆసీస్ తరపున 125 మ్యాచుల్లో ఆడాడు. గతేడాది ఫిబ్రవరిలో ప్యానల్‌లో చేరిన బెయిలీ ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత చీఫ్ సెలక్టర్‌గా పగ్గాలు అందుకుంటాడు.