కోహ్లీకి ఆ విషయంలో రవిశాస్త్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు: నెహ్రా

ABN , First Publish Date - 2020-08-03T22:39:03+05:30 IST

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవి శాస్త్రిల మధ్య చక్కటి సమన్వయం ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. ఒకరి నిర్ణయాలను..

కోహ్లీకి ఆ విషయంలో రవిశాస్త్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు: నెహ్రా

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవి శాస్త్రిల మధ్య చక్కటి సమన్వయం ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించుకుంటూ జట్టు అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటారు. వీరి మధ్య ఉండే సమన్వయం గురించి మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. కోచ్ రవిశాస్త్రి కెప్టెన్ విరాట్ కోహ్లీకి కావలసినంత స్వేచ్ఛ ఇస్తాడని, అలాగే కోచ్ నుంచి తనకు ఏం కావాలో కోహ్లీకి బాగా తెలుసని నెహ్రా చెప్పాడు. ‘రవిశాస్త్రి నుంచి ఆటగాళ్లకు మంచి ప్రేరణ లభిస్తుంది. కోహ్లీ కూడా దాదాపు అలాంటి వ్యక్తే. అందువల్ల ఇద్దరి మనస్తత్వాలు దగ్గరగా ఉంటాయి. దాంతో జట్టు సమన్వయంగా ఉండగలుగుతోంద’ని నెహ్రా పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే రవిశాస్త్రిని భారత జట్టు కోచ్‌గా 2017లో ఎంపిక చేశారు.

Updated Date - 2020-08-03T22:39:03+05:30 IST