Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆమె నిర్ణయం సరికాదు: భూపతి

న్యూఢిల్లీ: ఒసాకా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. పలువురు ప్లేయర్లు ఒసాకాకు మద్దతుగా నిలిచారు. అయితే భారత టెన్నిస్‌ మాజీ స్టార్‌ మహేశ్‌ భూపతి మాత్రం ఒసాకా నిర్ణయంతో విభేదించాడు. ఆ నిర్ణయం సరికాదంటూ.. సమస్యను ఆమె ఇంకా సమర్థంగా ఎదుర్కోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.


‘నేనూ గతంలో ఎన్నో విలేకరుల సమావేశాల్లో పాల్గొన్నా. కానీ నవోమి చెబుతున్న విషయాలతో నేను ఏకీభవించను. టెన్నిస్‌ ప్లేయర్లలో ముఖ్యంగా మేటి ఆటగాళ్ల జీవితంలో మీడియా అనేది ఓ భాగం. విలేకరులు వివిధ రకాల ప్రశ్నలు సంధిస్తారు. వాటిలో మనకు నచ్చని వాటిని దాటవేసే హక్కు ఉంటుంది. అందువల్ల ఒసాకా ఈ సమస్యను ఇంకా మెరుగైన రీతిలో పరిష్కరించుకొని ఉండాల్సింది’ అని భూపతి అన్నాడు.

Advertisement
Advertisement