న్యాయవ్యవస్థను కించపర్చడం బాధాకరం: జవహర్

ABN , First Publish Date - 2020-09-19T02:15:03+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. ‘న్యాయవ్యవస్థను కించపరిచేలా వైసీపీ నేతల వ్యాఖ్యలు. తక్షణమే

న్యాయవ్యవస్థను కించపర్చడం బాధాకరం: జవహర్

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. ‘న్యాయవ్యవస్థను కించపరిచేలా వైసీపీ నేతల వ్యాఖ్యలు. తక్షణమే అంబటి రాంబాబు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టాలి. న్యాయవ్యవస్థపై అసంబద్ధ ఆరోపణలు చేసి న్యాయవ్యవస్థ సమున్నత గౌరవాన్ని కించపరచడం సమర్థనీయం కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతో అమరావతి భూముల విషయంలో సిట్, కేబినెట్ సబ్ కమిటీ వేశారు. 16 నెలల కాలంలో ఎలాంటి అక్రమాలను నిరూపించలేక పోయారు. ఆధారాలు లేకపోవడంతో కోర్టుల్లో కేసులు నిలబడటం లేదు. ప్రతిపక్షంపై, కోర్టులపై విమర్శలు చేస్తున్నవారికి రాజ్యాంగ నిబంధనలు తెలియవా? ప్రభుత్వంలో ఉన్న లోపాలు, తప్పులను గ్రహించకుండా న్యాయ వ్యవస్థను తప్పు పట్టే దుస్సాహసానికి  దిగజారడం దురదృష్టకరం. ఓటుకు నోటు కేసులో బురదజల్లాలనే రాజకీయ కుట్రలో భాగంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్ వేస్తే కొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా వైసీపీ నేతల వాదనతో ఏకీభవించలేదు. బెయిల్‌పై బయట తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి.. తన అవినీతి బురదను ఇతరులకు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. వైన్, మైన్, ల్యాండ్ మాఫియాలతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబు, నారా లోకేష్‌పై ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో దళితులపై హింసాకాండ కొనసాగుతూనే ఉంది. జగన్ పాలనలో ప్రాథమిక హక్కులతో పాటు జీవించే హక్కును కూడా కాలరాస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు’ అని జవహర్ ధ్వజమెత్తారు.

Updated Date - 2020-09-19T02:15:03+05:30 IST