గ్రావెల్ మాఫియా వెనుక ఎమ్మెల్యే కాకాణి హస్తం: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2021-01-17T23:40:24+05:30 IST

సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా ఆగడాలకి అడ్డూఅదుపు లేకుండా పోతుందని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు

గ్రావెల్ మాఫియా వెనుక ఎమ్మెల్యే కాకాణి హస్తం: సోమిరెడ్డి

నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా ఆగడాలకి అడ్డూఅదుపు లేకుండా పోతుందని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డికి వాటా ఉందని ఆరోపించారు. డబ్బు కోసం కక్కుర్తిపడి రూ.కోట్ల విలువైన భూములని నామారూపాలు లేకుండా చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులకి గ్రావెల్ దొంగలపై కేసులు పెట్టే ధైర్యం ఉందా? ఎమ్మెల్యేల దారుణాలని ఎస్పీ, కలెక్టర్లు కూడా అడ్డుకోలేక పోవడం వల్ల సర్కారు మరింత అప్రతిష్టపాలవుతుందని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-01-17T23:40:24+05:30 IST