Abn logo
Oct 10 2021 @ 23:47PM

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

కామేపల్లి, అక్టోబరు 10 : వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం, ఈ క్రమంలోనే ఇంట్లో కలహాలు మొదలవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంలో జరిగింది. ముచ్చర్ల గ్రామానికి చెందిన బత్తుల వీరన్న (50) తనకున్న ఎకరం 35కుంటల భూమిలో పంట వేసేందుకు రెండేళ్లుగా సుమారు రూ.3లక్షలు అప్పు చేశాడు. అయితే అనుకున్నంత రాబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఇంతలోనే కుటుంబంలోనూ ఆర్థిక పరమైన కలహాలు మొదలయ్యాయి. దీంతో ఒత్తిడి భరించలేక వీరన్న శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి బత్తుల శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని కామేపల్లి ఎస్‌ఐ స్రవంతి తెలిపారు. మృతుడిుకి భార్య, కుమారుడు ఉన్నారు.