Advertisement
Advertisement
Abn logo
Advertisement

పీసీబీ చైర్మన్‌గా రమీజ్ రాజా.. ఏకగ్రీవంగా ఎన్నిక

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నూతన చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. 1984-1997 మధ్య కాలంలో పాకిస్థాన్ తరపు రమీజ్ రాజా 250కిపైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.


ఇప్పటి వరకు పీసీబీ చైర్మన్‌గా కొనసాగిన ఎహసాన్ మణి మూడేళ్ల పదవీకాలం ముగియడంతో గత నెలలోనే తప్పుకున్నారు. రమీజ్ రాజా గతంలో పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గానూ పనిచేశాడు. అయితే, కామెంటేటర్‌గానే రమీజ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ‘వాయిస్ ఆఫ్ పాకిస్థాన్’గా మారాడు. 


59 ఏళ్ల రాజా పెద్ద సోదరుడు వాసిం కూడా టెస్టు మ్యాచుల్లో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెడ్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగో పాక్ క్రికెటర్‌గా రమీజ్ రికార్డులకెక్కాడు. ఆయన కంటే ముందు అబ్దుల్ హఫీజ్ కార్దర్, జావెద్ బుర్కీ, ఇజాజ్ బట్ పీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. 

Advertisement
Advertisement