దెబ్బతిన్న పంటను చూసి కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-27T17:25:11+05:30 IST

సొంత భూమి లేకపోయినా వ్యవసాయంపై మమకారంతో కౌలుకు పొలం తీసు కుని మిరప పంట సాగు చేసిన ఆ రైతు జీవితం విషాదంగా ముగిసింది. ఎంతో కష్టపడి, ఇష్టపడి సాగు చేసిన మిరప పంట ఇటీవల

దెబ్బతిన్న పంటను చూసి కౌలు రైతు ఆత్మహత్య

కంప్లి(కర్ణాటక): సొంత భూమి లేకపోయినా వ్యవసాయంపై మమకారంతో కౌలుకు పొలం తీసు కుని మిరప పంట సాగు చేసిన ఆ రైతు జీవితం విషాదంగా ముగిసింది. ఎంతో కష్టపడి, ఇష్టపడి సాగు చేసిన మిరప పంట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేలమట్టం కావడంతో జీర్ణించుకోలేక జీవితాన్ని త్యజించాడు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడం చూసి తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. కురుగోడు తాలూకా బాదనట్టి గ్రామానికి చెందిన గాదెలింగప్ప (40) అనే రైతు శుక్రవారం క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాదెలింగప్ప ఐదున్నర ఎకరాల పొలంలో మిరప పంట సాగు చేశాడు. కౌలుకు తీసుకున్న పొలానికి ఎకరాకు రూ. 35 వేల చొప్పున ముందే సొమ్ము చెల్లించాడు. రూ. 5 లక్షలు వరకు పెట్టుబడులు పెట్టి మిరప పంట సాగు చేశాడు. ఇతర సాగు ఖర్చులు మొత్తం కలిపి రూ. 6.75 లక్షలు వరకు అప్పులు చేశాడు. గత రెండు వారాలుగా కురిసిన వర్షాలకు మిరప పంట పూర్తిగా నష్టపోయింది. గాదెలింగప్ప భార్యతో కలిసి పొలంలోకి వచ్చి పంటను చూశాడు. ఆమె పొలంలోనే వదిలి ఇంటికి వచ్చి క్రిమిసంహారక మందు సేవించాడు. వెంటనే అతడిని బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. పరిస్థితి విషమించి సాయంత్రం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సురేష్‌ బాబు, రైతు సంఘం నాయకుడు పురుషోత్తమ గౌడ గాదెలింగప్ప మృతదేహాన్ని పరిశీలించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం రైతు ఇంటి వద్ద ఎమ్మెల్యే జేఎన్‌ గణేష్‌, వ్యవసాయాధికారిదే వరాజు, గ్రామలెక్క అధికారి మల్లికార్జున మృతదేహాన్ని పరిశీలించారు. ఈ  విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తామన్నారు. 

Updated Date - 2021-11-27T17:25:11+05:30 IST