Abn logo
Jun 30 2020 @ 15:14PM

నలుగురు ఐపీఎస్‌ల పదవీవిరమణ

హైదరాబాద్ : రాష్ట్రంలో నేడు నలుగురు ఐపీఎస్ అధికారులు పదవీవిరమణ చేశారు. పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ ఎండీ మల్లారెడ్డి, ఎస్‌ఐబీ డీఐజీ ప్రభాకర్ రావు, పోలీస్ కమిషనర్, వరంగల్ డాక్టర్ రవీందర్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ వేంకటేశ్వర రావు. 


వీరిలో మొదటి ముగ్గురు డీఎస్పీలుగా చేరి ఐపీఎస్ లు కాగా, వేంకటేశ్వర్ రావు మాత్రం ఎస్ఐగా సర్వీసు ప్రారంభించి వివిధ పదోన్నతుల తర్వాత డీఐజీ హోదాకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు... ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ఎస్ఐ తన సర్వీసులో డీఐజీగా పదోన్నతి పొందిన దాఖలాలు లేవు. ఈ అరుదైన ఘట్టం వెంకటేశ్వర రావుకు సొంతమైంది.

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement
Advertisement