పది రోజులు... రూ. 4 వేల కోట్లు

ABN , First Publish Date - 2022-07-10T21:40:44+05:30 IST

ఒక్క జులైలోనే... రూ. 4 వేల కోట్లు.,

పది రోజులు... రూ. 4 వేల కోట్లు

* ఈక్విటీల నుంచి FIIల ఉపసంహరణలు

* ఇక ఈ ఏడాది ఇప్పటివరకు... రూ. 2.21 లక్షల కోట్లు...

ముంబై : ఒక్క జులైలోనే... రూ. 4 వేల కోట్లు., ఇక ఈ ఏడాది ఇప్పటివరకు... రూ. 2.21 లక్షల కోట్లు... ఈక్విటీల నుంచి జరిగిన ఉపసంహరణలివి. ఎఫ్‌పీఐ(Foreign Portfolio Investors) ఇంత భారీగా పెట్టుబడులను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు ? ప్రస్తుతం ఆర్ధికవేత్తల దృష్టి ఈ ప్రశ్నల చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయా దేశాల్లో మార్కెట్ పరిస్థితులు సహా రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం,  రాజకీయ పరిణామాలు సైతం ఇందుకు కారణాలుగా వినవస్తున్నాయి. ఈ క్రమానికి సంబంధించిన కథనమిది... FPIలు జూలైలో ఇప్పటివరకు ఈక్విటీల నుండి రూ. 4 వేల  కోట్లకు పైగా వెనక్కు తీసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలా వెనక్కు తీసుకున్న మొత్తం... దాదాపు రూ. 2.21 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. భారతీయ ఈక్విటీ మార్కెట్లను నీరసపరుస్తూే... మారుతున్న డాలర్ విలువ సహా Americaలో పెరుగుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో... విదేశీ పెట్టుబడిదారులు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,000 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 


గత కొన్ని వారాలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల విక్రయాల వేగం తగ్గుముఖం పడుతోంది. చమురు ధరలు బ్యారెల్‌కు USD 100 మార్కును అధిగమించడంతో పాటు మార్కెట్లలో రిఫైనింగ్ మార్జిన్లు బీటలు వారడంతో ద్రవ్యోల్బణం 

 తగ్గుతుందన్న అభిప్రాయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరచాయని భావిస్తున్నారు. RBI చర్యలు,  బిల్డింగ్ బుల్లిష్ మొమెంట్, స్లైడింగ్... రూపాయిపై ప్రభావం చూసించినట్లు మార్కెట్ నిపుణులు విజయ్ సింఘానియా పేర్కొన్నారు. కాగా... ఎఫ్‌పిఐల ద్వారా నికర ఉపసంహరణ వేగం తగ్గడం, అంతర్లీన డ్రైవర్‌లలో పెద్దగా మెరుగుదల లేకపోవడం...  ట్రెండ్‌లో మార్పును సూచిస్తోందని రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ, అభిప్రాయపడ్డారు. మొత్తంమీద FPIలు గత తొమ్మిది నెలలుగా అమ్మకాల మోడ్‌లో ఉన్నట్లు వినవస్తోంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుందని స్పష్టమైన సంకేతాలు వచ్చిన తర్వాత FPI  ఇన్‌ఫ్లోలు పునఃప్రారంభమవుతాయని, ఆగస్టు, సెప్టెంబరులో గ్లోబల్ సిపిఐ రీడింగ్‌లలో వ్యక్తమయ్యే అవకాశముందని, ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్, యస్ సెక్యూరిటీస్ లీడ్ అనలిస్ట్ హితేష్ జైన్ పేర్కొన్నారు.


ఇక... డిపాజిటరీల డేటా ప్రకారం, జూలై 1-8 మధ్య కాలంలో FPIలు భారతీయ ఈక్విటీ మార్కెట్ నుండి రూ. 4,096 కోట్ల నికర మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. కాగా... చాలా వారాల తర్వాత తొలిసారిగా FPIలు జూలై 6న రూ. 2,100 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడం విశేషం. జూన్‌లో ఈక్విటీల నుంచి రూ. 50,203 కోట్ల నికర ఉపసంహరణల తర్వాత ఇది జరిగింది. రూ. 61,973 కోట్ల  ఉపసంహరించుకున్న మార్చి 2020 తర్వాత ఇదే అత్యధిక నికర ప్రవాహం.


మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటివరకు ఈక్విటీల నుంచి  దాదాపు రూ. 2.21 లక్షల కోట్లకు చేరుకున్న  FPIల నికర అవుట్‌ఫ్లో... ‘ఆల్ టైమ్ హై’ అని హార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. గతంలో... అంటే 2008లో నికరంగా రూ. 52,987 కోట్లను ఉపసంహరణ చోటుచేసుకున్నట్లు డేటా చెబుతోంది. మొత్తంమీద... భారీగా జరిగిన మూలధన ప్రవాహం... భారత రూపాయి విలువ క్షీణతకు దారితీసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే... ఇటీవల డాలర్‌కు ‘79’  మార్కును అధిగమించింది. ఏతావాతా మార్కెట్ వర్గాలు స్థూలంగా చెబుతున్నదేమిటంటే... రిస్క్-రివార్డ్ కోణం సహా USలో వడ్డీ రేట్లు పెరగడంతో, భారతీయ రుణాలు విదేశీ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా కనిపించడం లేదు. 

Updated Date - 2022-07-10T21:40:44+05:30 IST