Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్రాన్స్ అమ్మాయి.. బిహార్ అబ్బాయి.. ఇద్దరూ ఒక్కటయ్యారు

ఎన్నారై డెస్క్: ఫాన్స్‌కు చెందిన అమ్మాయి, బిహార్‌కు చెందిన అబ్బాయి పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో వారి ప్రేమ వివాహం గురించి తెలుసుకుని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో వారిద్దరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఫ్రాన్స్‌కు చెందిన మ్యారీ లోరీ ఆరేళ్ల క్రితం ఢిల్లీని విజిట్ చేయడానికి ఇండియాకు వచింది. ఈ క్రమంలో బిహార్‌లోని బెగుసరై‌కు చెందిన టూర్ గైడ్ రాకేశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తొలుత స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. మ్యారీ లోరీ ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి ఫ్రాన్స్‌కు వెళ్లినప్పటికీ వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. మూడేళ్ల క్రితం రాకేశ్ కూడా తన పనికి స్వస్తిపలికి ప్యారీస్ బాటపట్టాడు. అక్కడ మ్యారీ లోరీతో కలిసి టెక్స్‌టైల్ బిజినిస్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే మ్యారీ లోరీ మనసులో మాటను తన తల్లిదండ్రుల వద్ద వ్యక్త పరిచింది. 


రాకేశ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కూతురి ప్రేమను ఆ తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. మ్యారీ లోరీ, రాకేశ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో రాకేశ్ కుటుంబ సభ్యలు, సన్నిహితుల మధ్య మ్యారీ లోరీ మెడలో తాళి కట్టి హిందూ వైవాహిక  సంప్రదాయం ప్రకారం బెగుసరైలో తాజాగా పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి మ్యారీ లోరీ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. కాగా.. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement