క్రిస్మస్‌ ఫ్రూట్‌ కేక్‌

ABN , First Publish Date - 2020-12-25T20:21:59+05:30 IST

కిస్‌మిస్‌, క్రాన్‌బెర్రీ, అంజూర్‌, చెర్రీస్‌, ఆప్రికాట్‌, ఎండు కర్జూరం తరుగు - పావు కప్పు చొప్పున, గ్రేప్‌ జ్యూస్‌ - 1 కప్పు, వేడి నీరు - ఒకటింబావు కప్పు, బ్రౌన్‌ షుగర్‌ - ఒక

క్రిస్మస్‌ ఫ్రూట్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: కిస్‌మిస్‌, క్రాన్‌బెర్రీ, అంజూర్‌, చెర్రీస్‌, ఆప్రికాట్‌, ఎండు కర్జూరం తరుగు - పావు కప్పు చొప్పున, గ్రేప్‌ జ్యూస్‌ - 1 కప్పు, వేడి నీరు - ఒకటింబావు కప్పు, బ్రౌన్‌ షుగర్‌ - ఒక కప్పు, నూనె - 2/3 కప్పు, మైదా - 2 కప్పులు, బేకింగ్‌ సోడా, పౌడర్‌ - ఒక టీ స్పూను చొప్పున, దాల్చినచెక్క పొడి, జాజికాయ పొడి, యాలకుల పొడి - పావు టీ స్పూను చొప్పున, ఉప్పు - చిటికెడు, నిమ్మతొక్క తరుగు - అర టీ స్పూను, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌ - 1 టీ స్పూను.


తయారుచేసే విధానం: బౌల్‌లో డ్రై ఫ్రూట్స్‌ అన్నీ వేసి ద్రాక్ష జ్యూస్‌ కలిపి రెండు గంటలు పక్కనుంచాలి. మరో బౌల్‌లో వేడి నీరు, బ్రౌన్‌ షుగర్‌, నూనె వేసి బాగా గిలకొట్టి అందులో మైదా, బేకింగ్‌ సోడా+పౌడర్‌, జాజికాయ, యాలకుల, దాల్చిన చెక్క పొడులు, ఉప్పు, నిమ్మ తొక్క తరుగు, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌, జ్యూస్‌ పిండిన డ్రైఫ్రూట్స్‌ వేసి బాగా కలిపి మిశ్రమాన్ని బేకింగ్‌ బౌల్‌లో వేసి ఒవెన్‌లో 180 డిగ్రీల వద్ద 40 నిమిషాలు ప్రీహీట్‌ చేసి 40 నిమిషాలు ఉంచి, టూత్‌ పిక్‌తో చెక్‌ చేసి తీయాలి.



Updated Date - 2020-12-25T20:21:59+05:30 IST