Abn logo
Jul 27 2021 @ 14:03PM

ఫ్యూయల్ డెలివరీ స్కీం... త్వరలో మరికొన్ని ప్రాంతాలకు

న్యూఢిల్లీ : ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న ‘హమ్ సఫర్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న బీపీసీఎల్... 20 లీటర్ల సామర్ధ్యమున్న క్యాన్లలో డీజిల్ ను డోర్ డెలివరీ చేస్తోన్న విషయం తెలిసిందే. అంటే... డీజిల్ కావాల్సి ఉంటే 20 లీటర్ల ఆర్డర్ చెయ్యాల్సి ఉంటుంది. డోర్ డెలివరీ స్కీం నేపధ్యంలో... అపార్ట్‌మెంట్‌లు, సెల్ ఫోన్ టవర్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు, బ్యాంకులు,ఆసుపత్రులు, హోటళ్ళ వంటి వాటికి ఉపయోగకరంగా ఉంటున్నట్లు బీపీసీఎల్ చెబుతోంది.


ఇక ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతోన్న ఈ పథకాన్ని   ఢిల్లీలో కూడా అమల్లోకి తీసుకువచ్చారు. ఇక్కడ సానుకూల ఫలితాలు వస్తే దేశమంతా విస్తరించే యోచనలో బీపీసీఎల్ వున్నట్టు వినవస్తోంది. మొత్తంమీద ఢిల్లీ ప్రయోగాన్ని మరికొద్ది రోజులపాటు అధ్యయనం చేసిన తర్వాత... సాధ్యమైనన్ని ఎక్కు వ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని బీపీసీఎల్ భావిస్తున్నట్లు వివనవస్తోంది. ప్రత్యేకించి... మందస్తుగా పట్టణ ప్రాంతాల్లో దీనిని అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.