Abn logo
Sep 13 2021 @ 18:23PM

గజ్వేల్ సభ అందరి సభ

హైదరాబాద్: గజ్వేల్ సభ అందరి సభ మనమంత కలిసి విజయవంతం చెయ్యాలని కాంగ్రెస్ నేత అరికెల నర్సారెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ కేవలం డబ్బులతో రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడ ప్రజలంతా వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. టిఆర్ఎస్ సర్పంచులు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. వాళ్ళకు బిల్స్ మంజూరు చేసి డబ్బులు ఇచ్చి అపుతున్నారన్నారు. ఇక్కడ అభివృద్ధి జరగలేదని నిరూపించాలన్నారు. అవినీతి ఉందని తేల్చి చెపితే రాష్ట్రమంతా మనకు లాభం జరుగుతుందని పేర్కొన్నారు.