Advertisement
Advertisement
Abn logo
Advertisement

గంగా నువు ప్రవహించెదవేల?

విస్తారపు తీరాలమ్మెట

బ్రతుకీడ్చే జనమెందుకు

చేస్తున్నరు హాహాకారాలు

సదా నిశ్శబ్దంగా ఓ గంగా నువు

ఓ గంగా నువు ప్రవహించెదవేల?


నైతికత నశించిపోయె, మానవత భ్రష్టుపట్టె

నిర్లజ్జగ నువు ప్రవహించెదవేల?

చలించమని చరిత్ర హూంకరిస్తోంది

ఓ గంగా ప్రవాహమా

ఈ నిర్బల జనావళిని 

సబల, సంగ్రమ యోధులుగా

కోపోగ్ర విప్లవ కారులుగా

పూనుకుని చేయవెందుకని?


చదువులేని అక్షరహీనులు, 

కడుపు నిండని అసంఖ్యాకులు

చూడలేవా కళ్ళులేవా ?

చలించమని చరిత్ర హూంకరిస్తోంది

ఓ గంగా ప్రవాహమా

ఈ నిర్బల జనావళిని 

సబల, సంగ్రమ యోధులుగా

కోపోగ్ర విప్లవ కారులుగా

పూనుకుని చేయవెందుకని?


స్వార్థంలో నిలువెల్లా కుంగిపోయిన మనిషి

ఏ విలువా మిగలక కుళ్లిన సమాజం

ఈ నిస్త్రాణ సమాజ శవాన్ని పట్టించుకోవెందుకని?

చలించమని చరిత్ర హూంకరిస్తోంది

ఓ గంగా ప్రవాహమా

ఈ నిర్బల జనావళిని 

సబల, సంగ్రమ యోధులుగా

కోపోగ్ర విప్లవ కారులుగా

పూనుకుని చేయవెందుకని?


నీ తేజస్సు ఎలా తరిగిపోయింది?

నీ మండే చైతన్యం ఆరిపోయింది

ప్రాణులకో ప్రేరణ పూరించలేవా?

అవని, కురుక్షేత్రంలో రేగిన యుద్ధరవాలు

గంగమ్మా, ఈ నవభారతంలో

ఎక్కడమ్మా భీష్ముని పోలిన సమరవీరులు


విస్తారపు తీరాలమ్మెట

బ్రతుకీడ్చే జనమెందుకు

చేస్తున్నరు హాహాకారాలు

సదా నిశ్శబ్దంగా ఓ గంగా నువు

ఓ గంగా నువు ప్రవహించెదవేల?


(భూపెన్‌ హజారికా ‘గంగా బెహతీహై క్యోం’కి తెలుగు అనువాదం)

అక్కిరాజు భట్టిప్రోలు

98665 51263


Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...