‘బీజేపీలో ఉంటేనే హిందువులా?’

ABN , First Publish Date - 2020-05-28T15:53:38+05:30 IST

కొందరు బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు తనపై లేనిపోని

‘బీజేపీలో ఉంటేనే హిందువులా?’

వరంగల్/హన్మకొండ : కొందరు బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు తనపై లేనిపోని తప్పుడు విమర్శలు చేయడాన్ని వేయిస్తంభాల గుడి ప్ర ధాన అర్చకుడు, రాష్ట్ర అర్చక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్ర శర్మ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. బీజేపీకి అనుకూలంగా ఉంటేనే హిందువులు, లేకుంటే కాదా అని ప్రశ్నించారు. తన గతం గురించి మాట్లాడే అర్హత బిజేపీ నాయకులకు లేదన్నారు.


పోలీసు కమిషనర్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు అన్ని మతాల పెద్దలతో పాటు తనను ఆహ్వానించినందువల్ల వెళ్ళానని, అది తప్పెలా అవుందని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాతో పాటు పార్లమెంట్‌లో సహకరించిన బీజేపీ నాయకులు సుస్మాస్వరాజ్‌, స్పీకర్‌ మీరాకుమారి క్షేమం కోరుతూ హోమం చేశామేకానీ ఒక్క సోనియా గాంధీ కోసం కాదన్న వాస్తవం తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో దేవాలయాలను పట్టించుకుంటున్నది సీఎం కేసీఆరేనని అన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-28T15:53:38+05:30 IST