ఆసియా కప్ రద్దుపై గంగూలీ చేసిన వ్యాఖ్యలకు విలువ లేదు: పీసీబీ

ABN , First Publish Date - 2020-07-09T22:14:53+05:30 IST

ఆసియా కప్ రద్దయిందంటూ బీసీసీఐ చీఫ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి విలువ లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

ఆసియా కప్ రద్దుపై గంగూలీ చేసిన వ్యాఖ్యలకు విలువ లేదు: పీసీబీ

న్యూఢిల్లీ: ఆసియా కప్ రద్దయిందంటూ బీసీసీఐ చీఫ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి విలువ లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీడియా డైరెక్టర్ శామియుల్ హసన్ బర్నీ అన్నారు. ఆసియా కప్ భవిత్యాన్ని చెప్పాల్సింది గంగూలీ కాదని, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అని అన్నారు. ఆసియా కప్ రద్దయినట్టు గంగూలీ బుధవారం ప్రకటించాడు. అయితే, అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఆతిథ్య దేశాన్ని నిర్ణయించడంలో వైఫల్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘‘డిసెంబరులో తొలి పూర్తి స్థాయి సిరీస్ ఉంటుంది. సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేశాం’’ అని గంగూలీ పేర్కొన్నాడు. 


అయితే, గంగూలీ వ్యాఖ్యలను హసన్ తప్పుబట్టాడు. ఇలాంటి ముఖ్యమైన ప్రకటనను కేవలం ఏసీసీ అధ్యక్షుడు మాత్రమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రొసీడింగ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపబోవని పేర్కొన్నారు. అతడు ప్రతీవారం ఇలాంటి వ్యాఖ్యలే చేసినా వాటికి ఏమాత్రం విలువ, యోగ్యత ఉండదని హసన్ తేల్చి చెప్పారు. ఆసియా కప్‌పై ఎటువంటి నిర్ణయమైనా ఏసీసీ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్న హసన్.. ఇలాంటి ప్రకటనను ఏసీసీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. తమకు తెలిసినంత వరకు ఏసీసీ తదుపరి సమావేశం గురించి ఇంకా ప్రకటించాల్సి ఉంటుందని హసన్ స్పష్టం చేశారు.  

Updated Date - 2020-07-09T22:14:53+05:30 IST