అతడు లేడని ఆందోళన ఏల?

ABN , First Publish Date - 2020-11-22T09:20:08+05:30 IST

ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్ట్‌లకు కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో భారత జట్టుపై పడే ప్రభావం ఎంత అనే విషయంపై

అతడు లేడని ఆందోళన ఏల?

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్ట్‌లకు  కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో భారత జట్టుపై పడే ప్రభావం ఎంత అనే విషయంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. కొందరైతే.. కోహ్లీ గైర్హాజరీతో బ్యాటింగ్‌ విభాగం బలహీన పడుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే..అలాంటి భయాలు వద్దంటున్నాడు దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గవాస్కర్‌. విరాట్‌ లేని ప్రతిసారీ ఇతర ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని గుర్తు చేశాడు. ‘గతంలో కోహ్లీ లేనప్పుడు కూడా టీమిండియా చక్కటి ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాతో ధర్మశాల టెస్ట్‌, అఫ్ఘానిస్థాన్‌తో టెస్ట్‌, నిదహాస్‌ ట్రోఫీ, 2018 ఆసియా కప్‌ను భారత్‌ గెలిచింది. నిజం చెప్పాలంటే.. విరాట్‌ లేనప్పుడు భారత ఆటగాళ్లు మరింత బాగా ఆడడానికి ప్రయత్నిస్తారు’ అని గవాస్కర్‌ చెప్పాడు.

Updated Date - 2020-11-22T09:20:08+05:30 IST