ఐటీ శ్లాబుల్లో మార్పులు?

ABN , First Publish Date - 2021-01-27T07:42:32+05:30 IST

సాధారణ బడ్జెట్‌ దగ్గర పడుతోంది. దీంతో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులు ఎప్పటిలానే ఈసారీ కేంద్ర బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఐటీ శ్లాబుల్లో మార్పులు?

ఆరోగ్య బీమాపై మరింత రిబేట్‌

ఎల్‌టీసీ గడువు పొడిగింపు

డిమాండ్‌ పెంపే అసలు లక్ష్యం 


సాధారణ బడ్జెట్‌ దగ్గర పడుతోంది. దీంతో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులు ఎప్పటిలానే ఈసారీ కేంద్ర బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కొవిడ్‌ దెబ్బతో చితికిపోయిన ఆదాయాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పన్ను రాయితీలు ఏమైనా ఇస్తారా? లేక సారీ చెబుతారా? అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.  


కొవిడ్‌-19 దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు ఉన్నవారి ఆదాయాలూ గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ప్రతి వ్యక్తీ పొదుపు మంత్రం పాటించక తప్పడం లేదు. తప్పనిసరైతే తప్ప ఖర్చులకు పోవడం లేదు. దీంతో డిమాండ్‌ పూర్తిగా పడిపోయింది. డిమాండ్‌ పెంచితే తప్ప ఆర్థిక వ్యవస్థ మళ్లీ వృద్ధి బాట పట్టదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రజల చేతుల్లో మరిన్ని డబ్బులు ఉంచేలా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 



రియల్టీని ఆదుకోండి : బిల్డర్లు

వడ్డీ సబ్వెన్షన్‌ పథకంపై విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలి

అందుబాటు ధరల (అఫర్డబుల్‌) గృహాల నిర్వచనాన్ని మార్చాలి. మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్ల కార్పెట్‌ ఏరియా నుంచి 90 మీటర్లకు, నాన్‌ మెట్రో నగరాల్లో 90 చదరపు మీటర్ల నుంచి 120 మీటర్లకు విస్తరించాలి

గృహ రుణాల వార్షిక వడ్డీ చెల్లింపు ఆదాయ మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి

అసలు చెల్లింపునకు ఇచ్చే ఆదాయ మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలి

సిమెంట్‌, స్టీల్‌ వంటి వస్తువుల కొనుగోలుపై చెల్లించే జీఎ్‌సటీకి ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను అనుమతించాలి

ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించినప్పుడల్లా ఆ పూర్తి తగ్గింపు ప్రయోజనం గృహ రుణాలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలి

బిల్డర్ల నిధుల కొరతను తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 


గత ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన మినహాయింపులు లేని ఐటీ శ్లాబులు/పన్ను రేట్ల విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు హెచ్‌ఆర్‌ఏ, జీతం నుంచి కొంత ప్రామాణిక  తగ్గింపు, ఇతర పెట్టుబడి మినహాయింపులను జత చేసే అవకాశం ఉందని భావిస్తున్నాం.

 రాకేశ్‌ నాంజియా, చైర్మన్‌, నాంజియా ఆండర్సన్‌ ఇండియా




ఆదాయం పెంచే చర్యలు..

పన్ను పోటు తగ్గించేలా ఐటీ శ్లాబుల్లో మార్పులు

‘మినహాయింపు’ల పరిమితుల్ని మరింత పెంచే అవకాశం 

స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచే చాన్స్‌ 

ఆరోగ్య బీమా ప్రీమియంపై మరింత రాయితీ, ఎల్‌టీసీ గడువు మరింత పెంపు

గృహ రుణ వడ్డీ, అసలు చెల్లింపులపైనా మినహాయింపు పరిమితి పెరిగే అవకాశం

మరింత ఆకర్షణీయంగా ‘మినహాయింపు’లు లేని ఐటీ శ్లాబులు

ఆదాయ పన్నుపై కాకుండా ఖర్చులపై రిబేటు

పన్ను ఉపశమనాలకు బదులుగా మౌలిక రంగంపై ఖర్చుల పెంపు

నగదు బదిలీ పథకం ద్వారా నిరుపేద వర్గాల చేతికి మరింత ఆదాయం


టాస్క్‌ఫోర్స్‌ సిఫారసులు 

పన్ను చెల్లింపుదారుల చేతిలో మరింత నగదు ఉండేలా చూసేందుకు ప్రత్యక్ష పన్నుల టాస్క్‌ఫోర్స్‌ ఇప్పటికే కొన్ని సిఫారసులు చేసింది. ఈ సిఫారసులు అమలు చేస్తే పన్ను చెల్లింపుదారుల దగ్గర నగదు లభ్యత పెరిగి డిమాండ్‌ ఊపందుకుంటుందని భావిస్తున్నారు.   


అవేమిటంటే..

వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు 10 శాతం పన్ను

రూ.10-20 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20 శాతం పన్ను

రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు 30 శాతం పన్ను

రూ.2 కోట్లకు మించి వార్షిక ఆదాయం ఉన్న వారిపై 35 శాతం పన్ను

Updated Date - 2021-01-27T07:42:32+05:30 IST