Abn logo

అల్లం సూప్‌

కావలసినవి: తియ్యటి గుమ్మడికాయ - ఒకటి, అల్లం - 50 గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, వెజిటబుల్‌ స్టాక్‌ - నాలుగు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఆలివ్‌ ఆయిల్‌ - ఒక టేబుల్‌స్పూన్‌. 


తయారీ : అల్లం, వెల్లుల్లి రెబ్బలను దంచుకోవాలి. ఉల్లిపాయలు కట్‌ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. నూనె వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు తియ్యటి గుమ్మడి కాయ ముక్కలు, వెజిటబుల్‌ స్టాక్‌ వేసి కలపాలి. అరగంటపాటు ఉడికించాలి. గుమ్మడికాయ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేస్తే అల్లం సూప్‌ రెడీ. వేడిగా వేడిగా సర్వ్‌ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిజ్‌లో పెట్టుకుని తరువాత క్విక్‌ మీల్‌గా సర్వ్‌ చేయవచ్చు.

నిమ్మగడ్డి - కొత్తిమీర సూప్‌గుమ్మడికాయ సూప్‌క్యారెట్‌ సూప్‌పుదీనా - పచ్చిబఠాణీ సూప్‌టొమాటో మిరియాల సూప్‌అల్లం బేరీ స్మూతీఇమ్యూన్‌ బూస్టింగ్‌ సూప్‌ఫ్రెంచ్‌ ఆనియన్‌ సూప్‌కొత్తిమీర సూప్‌జీడిపప్పు టమాటా సూప్‌
Advertisement
d_article_rhs_ad_1
Advertisement