జర్నలిస్టు వెంకన్న కుటుంబానికి ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-06-22T04:32:53+05:30 IST

‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికలో 16 ఏళ్లకుపైగా కల్చరల్‌, ఎడ్యుకేషన్‌ రిపోర్టర్‌గా పని చేస్తూ కరోనతో మృతిచెందిన కాసం వెంకన్న కుటుంబానికి సోమవారం నగదు సాయం అందించారు.

జర్నలిస్టు వెంకన్న కుటుంబానికి ఆర్థికసాయం
నగదు అందజేస్తున్న ఆంధ్రజ్యోతి బ్రాంచ్‌ మేనేజర్‌ పుల్లారావు

 ఆంధ్రజ్యోతి కుటుంబ సభ్యులు రూ.62వేలు, అన్నం శ్రీనివాసరావు రూ.20వేలు అందజేత

ఖమ్మంఖానాపురంహవేలి, జూన్‌21: ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికలో 16 ఏళ్లకుపైగా కల్చరల్‌, ఎడ్యుకేషన్‌ రిపోర్టర్‌గా పని చేస్తూ కరోనతో మృతిచెందిన కాసం వెంకన్న కుటుంబానికి సోమవారం నగదు సాయం అందించారు. ఆంధ్రజ్యోతి ఉమ్మడి జిల్లా విలేకరులు, ఉద్యోగులు సేకరించిన రూ.62వేలు ఆర్థికసాయాన్ని బ్రాంచి మేనేజర్‌ తాళ్లూరి పుల్లారావు, బ్యూరో ఇన్‌చార్జి నలజాల వెంకటరావు, ఎడిషన్‌ ఇన్‌చార్జి కొల్లు రాజేష్‌, స్టాప్‌రిపోర్టర్‌ తాళ్లూరి రమేష్‌ అందించారు. ఈసందర్భంగా బ్రాంచి మేనేజర్‌ తాళ్లూరి పుల్లారావు, బ్యూరో ఇన్‌చార్జి నలజాల వెంకటరావు మాట్లాడుతూ వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వెంకన్న కుటుంబానికి మిత్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ కురువెళ్ల ప్రవీణ్‌ ప్రకటించిన రూ.10వేల సహా యాన్ని సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో సబ్‌ ఎడిటర్‌ కసుపు వెంకట రమణ, విలేకరులు మామిళ్ల నర్సింహారావు, ఫొటోగ్రాఫర్‌ రవిశంకర్‌ పాల్గొన్నారు.

 అన్నం శ్రీనివాసరావు రూ.20 వేల సాయం

  బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డు ఉద్యోగి, పారాలీగల్‌ వలంటీర్‌ అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు తన నెల రోజులపింఛన్‌ రూ.20వేలు వెంకన్న కుటుంబానికి అందించారు. జర్నలిస్టుగా వెంకన్న సమాజానికి సేవలందించారని, వారి కుటుంబానికి నావంతుగా   పింఛన్‌ను సహాయంగా అందించానని చెప్పారు. 

Updated Date - 2021-06-22T04:32:53+05:30 IST