నాలుగు కోట్లకు చేరువైన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-18T09:59:33+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరగడమే తప్ప ఎక్కడా తగ్గుదల కనిపించడం లేదు.

నాలుగు కోట్లకు చేరువైన కరోనా కేసులు

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరగడమే తప్ప ఎక్కడా తగ్గుదల కనిపించడం లేదు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తాజాగా నాలుగు కోట్లకు చేరువైంది. ప్రస్తుతం కరోనా బారిన పడిన వారి సంఖ్య 3 కోట్ల 95 లక్షల 2 వేల 909గా ఉంది. వీరిలో 2 కోట్ల 71 లక్షల 48 వేల 927 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 80,86,780 కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 2,18,980 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో 31,97,539 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అమెరికా తరువాత అత్యధిక కరోనా కేసులు భారత్, బ్రెజిల్‌లో నమోదయ్యాయి. భారత్‌లో 74,32,680 కేసులు నమోదు కాగా.. బ్రెజిల్‌లో 52,00,300 కేసులు బయటపడ్డాయి. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా రికవరీ సంఖ్యలో భారత్ ముందు స్థానంలో నిలిచింది. భారత్‌లో ఇప్పటివరకు 65,24,595 మంది కరోనాను జయించారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 50 శాతానికి పైగా కేసులు ఈ మూడు దేశాల్లోనే నమోదుకావడం విశేషం. 

Updated Date - 2020-10-18T09:59:33+05:30 IST