అంపైర్లకు గ్లౌజులు.. ఐసొలేషన్‌ క్యాంప్‌లు

ABN , First Publish Date - 2020-05-23T09:23:14+05:30 IST

ఓజట్టు వెంట చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌తో పాటు బయో సేఫ్టీ అధికారి ఉండాలి. వీళ్లు ఎప్పటికప్పుడు ఆటగాడితో పాటు మ్యాచ్‌ అధికారులకు కరోనా పరీక్షలు నిర్వహించాలి.

అంపైర్లకు గ్లౌజులు.. ఐసొలేషన్‌ క్యాంప్‌లు

దుబాయ్‌: క్రికెట్‌ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే మొదలవుతుండడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ జరిగే ప్రతిచోటా తాము సూచించిన ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది. 


ఆ మార్గదర్శకాలేంటో చూద్దాం.

శిక్షణ సమయంలో..

ఓశిక్షణ వేదికల వద్ద ఆటగాళ్లందరికీ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి

ఓప్రాక్టీస్‌ సమయంలో ఆటగాళ్లంతా చిన్నచిన్న   గ్రూపులుగా విడిపోయి శిక్షణ ఆరంభించాలి.

ఓప్రాక్టీస్‌ వద్ద సిబ్బంది సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఓశిక్షణకు ముందు, తర్వాత ఆటగాళ్ల వ్యక్తిగత వస్తువులను శానిటైజ్‌ చేసుకోవాలి. ఒకరి వస్తువులను మరొకరు వాడరాదు.

ఓఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎక్కువసేపు ఉండకూడదు. వామప్‌ జరుగుతున్నపుడు లేదా మధ్యలో టాయ్‌లెట్‌, షవర్‌కు వెళ్లడం కూడా మానుకోవాలి.


మ్యాచ్‌ సమయంలో..

ఓమ్యాచ్‌కు ముందు ప్రతి జట్టుకు 14 రోజుల ఐసొలేషన్‌ క్యాంప్‌లు నిర్వహించాలి. 

ఓజట్టు వెంట చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌తో పాటు బయో సేఫ్టీ అధికారి ఉండాలి. వీళ్లు ఎప్పటికప్పుడు ఆటగాడితో పాటు మ్యాచ్‌ అధికారులకు కరోనా పరీక్షలు నిర్వహించాలి. 

ఓఅంపైర్లు గ్లౌజులు ధరించాలి. ఓబౌలర్లు బంతిపై ఉమ్మి పూయకూడదు.

ఓఆటగాళ్లు కళ్ల జోళ్లు, క్యాప్‌లు, స్వెట్టర్లు అంపైర్లకు లేదా సహచరులకు ఇవ్వరాదు. 

ఓవికెట్‌ పడినప్పుడు ఒకరినొకరు తాకుతూ సెలెబ్రేషన్స్‌ చేసుకోరాదు.

ఓఒకే బాటిల్‌ లేదా టవల్‌ను ఒకరికంటే ఎక్కువ మంది పంచుకోకూడదు. 

ఓమ్యాచ్‌కు ముందు, అనంతరం ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎక్కువసేపు ఉండకూడదు. 

ఓఒకవేళ స్టేడియంలో ప్రేక్షకులను అనుమతిస్తే, భౌతికదూరం కచ్చితంగా పాటించేలా చూడాలి.

Updated Date - 2020-05-23T09:23:14+05:30 IST