జీవో 317 ఉద్యోగుల పాలిట శాపం

ABN , First Publish Date - 2022-01-15T05:54:13+05:30 IST

జీవో నెంబరు 317 రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందని ఇంటర్‌ విద్యజేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి అన్నారు

జీవో 317 ఉద్యోగుల పాలిట శాపం
కాపీలను భోగి మంటల్లో వేస్తున్న అధ్యాపకులు

14కేపీ5-జీవో నెంబరు 317 

ఇంటర్‌ విద్య జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి

ఖమ్మంఖానాపురంహవేలి, జనవరి14: జీవో నెంబరు 317 రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందని ఇంటర్‌ విద్యజేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని నయాబజార్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలోని అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏకపక్షంగా ప్రభుత్వం జారీచేసిన 317 జీవోను రద్దు చేయాలని, అశాస్ర్తీయంగా జరిగిన అధ్యాపకుల కేటాయింపులు, ఉపసంహరించుకోవాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగువారి ప్రీతిపాత్రమైన సంక్రాంతి పండుగను భార్యాభర్తలు కలిసి జరుపుకునే వీలు లేకుండా చేశారన్నారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన భోగి మంటల్లో జీవోనెంబరు 317 కాపీలను దహనం చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రిన్సిపాళం్ల సంఘం అధ్యక్షుడు కేఎస్‌ రామారావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌, సింహాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రిన్సిపాల్స్‌ సంఘం కార్యదర్శి రామలింగేశ్వరరావు, జి.ప్రమీల, విజయలక్ష్మి, లలిత, కాంట్రాక్టు అధ్యాపకుల అధ్యక్షుడు విజయ్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-15T05:54:13+05:30 IST