ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యాం వద్ద 26.9 మీటర్లకు గోదావరి వరద నీరు చేరుకుంది. కొత్తూరు కాజ్‌వేపై 15 అడుగులకు గోదావరి వరద చేరుకుంది. 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర రాకపోకలకు అధికారులు పడవలు ఏర్పాటు చేశారు.