పసిడి సిరులు

ABN , First Publish Date - 2021-01-01T06:37:59+05:30 IST

బులియన్‌ మార్కెట్‌ 2020లో నూ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు పంచింది. 2019 డిసెంబరు 31న దేశీయ మార్కెట్లో రూ.

పసిడి సిరులు

 కొత్త ఏడాదిలోనూ అదే జోరు!


బులియన్‌ మార్కెట్‌ 2020లో నూ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు పంచింది. 2019 డిసెంబరు 31న దేశీయ మార్కెట్లో రూ.39,240 పలికిన 10 గ్రాముల మేలిమి బంగారం 2020 చివరి రోజున రూ.50,202 పలికింది. ఈ లెక్కన గత ఏడాది బంగారం మదుపరులకు 27.94 శాతం లాభాలు పంచింది. 2019లోనూ పసిడి.. ఇన్వెస్టర్లకు 23.75 శాతం లాభాలు పంచింది. 


కలిసొచ్చిన అంశాలు :

కొవిడ్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం 2020లో బులియన్‌ మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో పెట్టుబడుల భద్రత కోసం ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లకు ఎగబడ్డారు. వడ్డీ రేట్లు తగ్గటం, అమెరికా-చైనా మధ్య కొనసాగిన ఉద్రిక్తతలు ఇందుకు దోహదం చేశాయి. ఈ పరిణామాలతో గత ఏడాది ఆగస్టులో ఒక దశలో దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం రూ.56,000 మార్కును దాటింది.


అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్‌ బంగారం (31.10 గ్రాములు) ధర 2,080 డాలర్లకు చేరింది. భవిష్యత్‌ ఆశాజనకం ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.50,200 నుంచి రూ.50,500 మధ్య ట్రేడవుతోంది. కొవిడ్‌ అదుపులోకి రాకపోతే ఇది మరింత పెరిగి రూ.60,000 నుంచి రూ.63,000 స్థాయికి చేరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. 



కొవిడ్‌ వ్యాక్సిన్‌ వార్తలతో ప్రస్తుతం పసిడి ధర కొద్దిగా దిద్దుబాటుకు లోనైంది. సెంటిమెంట్‌ పరంగా చూస్తే పసిడి ధర మరింత పెరిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. 

- రవీంద్ర రావు, వైస్‌ ప్రెసిడెంట్‌, కమోడిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌ 

Updated Date - 2021-01-01T06:37:59+05:30 IST