మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?

ABN , First Publish Date - 2021-05-18T01:33:31+05:30 IST

అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో నేడు భారత బులియన్ మార్కెట్లో బంగారం పసిడి ధర పెరిగింది.

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో నేడు భారత బులియన్ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. ఢిల్లీలో నేడు పది గ్రాముల బంగారం ధర రూ. 348 పెరిగి రూ. 47,547కు చేరుకుంది. ఎప్పుడూ పుత్తడి బాటలోనే పయనించే వెండి కూడా నేడు కిలోకు రూ. 936 పెరిగింది. ఫలితంగా కిలో వెండి ధర రూ. 71,310కి చేరుకుంది.


అంతర్జాతీయంగా చూసుకుంటే ఔన్సు బంగారం ధర 1,853 డాలర్లుగా ఉండగా, వెండి 27.70 డాలర్లుగా ఉంది. యూఎస్ బాండ్ ఈల్డ్స్‌లో తగ్గుదల కారణంగా బంగారం ధర పెరిగిందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక, హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 49,650గా ఉంది. 

Updated Date - 2021-05-18T01:33:31+05:30 IST