కరీంనగర్ జిల్లాలో అరుదైన బంగారు చేపలు

ABN , First Publish Date - 2021-06-14T20:58:23+05:30 IST

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండల కేంద్రంలో మత్స్యకారుల పంటపండింది.

కరీంనగర్ జిల్లాలో అరుదైన బంగారు చేపలు

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండల కేంద్రంలో మత్స్యకారుల పంటపండింది. రామన్నపేట చెరువులో మత్స్యకారులకు బంగారు తీగ జాతికి చెందిన మూడు చేపలు వలకు చిక్కాయి. లేత ఎరుపు వర్ణంలో ఉండడంతో వాటిని కొనేందుకు పోటీ పడ్డారు. వలలో ఇలాంటి చేపలు పడడం అరుదని... బంగారు తీగ జాతికి మంచి డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. బంగారు తీగ జాతితోపాటు మొత్తం 20 క్వింటాళ్ల చేపలు వలకు చిక్కాయి. చేపలు కొనేందుకు ప్రజలు పోటీ పడ్డారు.

Updated Date - 2021-06-14T20:58:23+05:30 IST