Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 23 2021 @ 19:22PM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో దుబాయ్ నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న రూ.18 లక్షల విలువైన బంగారం, ఐ ఫోన్‌లను పట్టుకుని సీజ్ చేశారు. ప్రయాణికుడు రిస్ట్ వాచీలో బంగారాన్ని దాచి మరీ అక్రమంగా తీసుకొస్తున్నాడు. అయితే విమానాశ్రయంలో తనిఖీలు చేసే క్రమంలో స్కానింగ్ మెషీన్ వద్ద అతడు దొరికిపోయాడు. దీంతో అతడి వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Advertisement
Advertisement