Advertisement
Advertisement
Abn logo
Advertisement

గూగుల్‌ డ్రైవ్‌..అప్‌లోడింగ్‌ ఇలా

గూగుల్‌ డ్రైవ్‌ నిజానికి డేటా బ్యాకప్‌. ఇమేజెస్‌, వీడియోలు, డాక్యుమెంట్స్‌ సహా మీ ఫోన్‌లో ఉన్న వాటినీ స్టోర్‌ చేస్తుంది. తద్వారా ఫోన్‌లో స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు. ఒకసారి గూగుల్‌ డ్రైవ్‌లోకి పంపుకొంటే సరి, డివై్‌సలో నుంచి ఖాళీ చేసేయవచ్చు. ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ నుంచి కూడా అదే వెసులుబాటు లభిస్తుంది. అయితే తాజా నిబంధనల ప్రకారం గూగుల్‌  అకౌంట్‌ మొత్తానికి కలిపి 15జీబీ మాత్రమే ఉచితంగా లభిస్తుంది. అలాగే గూగుల్‌ డ్రైవ్‌ అన్ని తరహాల ఫైల్స్‌ని సపోర్ట్‌ చేస్తుంది. కంప్యూటర్‌, ఫోన్‌ నుంచి క్లౌడ్‌కు ఫైల్స్‌ను అప్‌లోడ్‌ చేయవచ్చు. 


అదెలాగంటే....

కంప్యూటర్‌ లేదంటే డెస్క్‌ టాప్‌ నుంచి  డ్రైవ్‌.గూగుల్‌.కామ్‌ ద్వారా ఈ పని చేసుకోవచ్చు. ప్రైవేటు లేదంటే షేర్డ్‌ ఫోల్డర్స్‌కు ఫైల్స్‌ను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

 మీ కంప్యూటర్‌పై డ్రైవ్‌.గూగుల్‌.కామ్‌లోకి వెళ్ళాలి. 

టాప్‌లో ఎడమవైపు న్యూ పై క్లిక్‌ చేస్తే ఫైల్‌ అప్‌లోడ్‌ లేదా ఫోల్డర్‌ అప్‌లోడ్‌ కనిపిస్తాయి. 

అప్‌లోడ్‌ను అనుసరించి ఫైల్‌ లేదంటే ఫోల్డర్‌ను ఎంపిక చేసుకోవాలి. అయితే, గూగుల్‌ డ్రైవ్‌లో ఉన్న పేరుతోనే ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేసుకోవాలని భావించారని అనుకోండి. అప్పటికే అక్కడే ఉన్న అది రివిజన్‌ పేరిట అప్‌లోడ్‌ అవుతుంది. 

రెండు ఫైల్స్‌ కావాలని అనుకుంటే

మీ కంప్యూటర్‌లో డ్రైవ్‌.గూగుల్‌.కామ్‌ లోకి వెళ్ళాలి.

ఒక ఫైల్‌ అప్‌లోడ్‌ చేయాలి.

సెపరేట్‌ ఫైల్‌గా ఉంచాలని క్లిక్‌ చేయాలి.

ఆండ్రాయిడ్‌లో గూగుల్‌ డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేయాలంటే

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేదా టాబ్లెట్‌లో గూగుల్‌ డ్రైవ్‌ యాప్‌ని ఓపెన్‌ చేయాలి.

టాప్‌ యాడ్‌, టాప్‌ అప్‌లోడ్‌

అప్‌లోడ్‌ చేయాలని అనుకున్న ఫైల్స్‌ను చూసుకుని టాప్‌ చేయాలి.

మూవ్‌ చేసేవరకు మై డ్రైవ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌ను చూడవచ్చు.

ఫోల్డర్‌ను అప్‌లోడ్‌ చేసేందుకు కంప్యూటర్‌పై డ్రైవన్‌ను ఓపెన్‌ చేసుకోవాలి. 


ఐఫోన్‌, ఐపాడ్‌లో

ఐఫోన్‌ లేదంటే ఐపాడ్‌లో గూగుల్‌ డ్రైవ్‌ యాప్‌ని ఓపెన్‌ చేయాలి.

టాప్‌ యాడ్‌, టాప్‌ అప్‌లోడ్‌ చేయాలి.

అప్‌లోడ్‌ చేయాలని అనుకుంటున్న ఫైల్‌ని తీసుకుని టాప్‌ చేయాలి.

ఫొటోలు లేదంటే వీడియోలను అప్‌లోడ్‌ చేయాలంటే ఏవి అనుకుంటే వాటిని టాప్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...