ఏపీలో సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తున్నారు: బుచ్చయ్యచౌదరి
ABN , First Publish Date - 2021-05-28T00:56:28+05:30 IST
ఏపీలో సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడే
అమరావతి: ఏపీలో సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్షకోట్లు దోచిన వ్యక్తి సీఎంగా వచ్చారని, ఇప్పుడు లక్షల కోట్లు దోపిడీ లక్ష్యంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో ఆర్థిక ఉగ్రవాదం నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతు పంటలకు మాత్రం గిట్టుబాటు ధర దక్కట్లేదని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. కేజీకి రూపాయి కూడా లేక టమోటా రైతులు రోడ్డుపై పారబోస్తున్నారని తెలిపారు. అమ్మబోతే అడవి, కొనబోతే కరివి లా రైతుల పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రైతుల వద్ద పెరగని ధరలు ప్రజల వద్ద ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ఆదాయం నుంచి ధరలను స్థిరీకరించి ప్రజల్ని ఆదుకోవాలని బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు.