Abn logo
Oct 9 2021 @ 12:22PM

ప్రభుత్వ కార్యాలయంలో ‘మందు’ బాబుల దావత్

ఖమ్మం: నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఒక విభాగంలో శుక్రవారం సగం తాగిన మద్యం గ్లాస్‌ కనబడటం సంచలనం కలిగించింది. కార్యాలయంలో రాత్రిపూట మద్యం తాగుతున్నారా? విధులు పూర్తికాగానే పార్టీలు చేసుకుంటున్నారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. విధులకు సమయం అయిపోయిన తరువాత విభాగాల గదులకు తాళం వేస్తారు. ఒకవేళ రాత్రివేళ మందు సేవిస్తే, బయట ప్రదేశంలో దానికి సంబంధించిన సీసాలు, గ్లాసులు ఉండాలి. అలా కాకుండా ఏకంగా విభాగంలోని డెస్క్‌ కింది భాగంలో సగం తాగి ఉంచిన గ్లాస్‌ కనబడటం చర్చకు దారితీస్తోంది. సమయం అయ్యాక తీరిగ్గా కూర్చొని మద్యం సేవిస్తున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి.