Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: ఉత్తమ్‌

సూర్యాపేట: వర్షాకాలం పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమయిందని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆరోపించారు. వానాకాలం పంట కొనుగోళ్లపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని, గ్రామాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఎందుకు తెరవలేదు? అని ఉత్తమ్ ప్రశ్నించారు. యాసంగిలో రైతులకు ఇష్టమైన పంట వేసుకునే స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజా కొంటామన్న ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెడుతుంది? అని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement