అధికార పార్టీ నేతలు ఆక్రమించింది ప్రభుత్వ భూమే: ఆర్డీవో
ABN , First Publish Date - 2021-03-01T21:02:00+05:30 IST
జిల్లాలోని అధికార పార్టీ నేతల భూ కబ్జాలపై అధికార యంత్రాంగం
నెల్లూరు రూరల్: జిల్లాలోని అధికార పార్టీ నేతల భూ కబ్జాలపై అధికార యంత్రాంగం స్పందించింది. కొత్తూరు నక్కా గోపాల్ నగర్‌లో అధికార పార్టీ నేతలు ఆక్రమించింది ప్రభుత్వ భూమేనని ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ తేల్చి చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కొత్తూరులో ఉన్న నక్కా గోపాల్ నగర్‌లో ప్రభుత్వ భూమి ఉంది. అయితే కొంతమంది అధికార పార్టీ నేతలు ఆ భూమిని ఆక్రమించారు. రాత్రికి రాత్రే లే అవుట్ వేశారు. గ్రామస్థులు ఆందోళన చెంది ఏబీఎన్‌కు సమాచారం అందించారు. దీంతో భూ కబ్జాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తాకథనాలు ప్రసారం చేసింది.
ఈ కథనాలపై అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. నక్కా గోపాల్ నగర్‌లో ఉన్న భూమి ప్రభుత్వ భూమేనని ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ స్పష్టం చేశారు. ఆ భూమిని గతంలో వ్యవసాయ అవసరాల కోసం గ్రామస్థులకు ఇచ్చారని ఆర్డీవో తెలిపారు. అలాంటి భూమిలో లే అవుట్ వేయడం నిబంధనలకు విరుద్దమని ఆయన పేర్కొన్నారు. లే అవుట్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ని ఆదేశించినట్లు ఆర్డీవో హుస్సేన్ తెలిపారు.