తెలంగాణలో యూనివర్సిటీల వీసీలను ప్రకటించిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-05-23T00:21:53+05:30 IST

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఎట్టకేలకు వైస్‌ చాన్స్‌లర్లను ప్రభుత్వం నియమించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత

తెలంగాణలో యూనివర్సిటీల వీసీలను ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఎట్టకేలకు వైస్‌ చాన్స్‌లర్లను ప్రభుత్వం నియమించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. జాబితాను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేస్తుందని భావించగా.. సాధ్యపడలేదు. దీంతో శనివారం ప్రకటించారు.


ప్రభుత్వం నియమించిన వీసీలు వీరే..

ఓయూ వీసీగా ప్రొ. రవీందర్ యాదవ్ నియామకం

అంబేద్కర్ వర్సిటీ వీసీగా సీతారామరావు

తెలుగు వర్సిటీ వీసీగా కిషన్‌రావు

శాతవాహన వర్సిటీ వీసీగా ప్రొ. మల్లేశం

తెలంగాణ వర్సిటీ వీసీగా రవీందర్ గుప్తా

మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా ప్రొ. గోపాల్‌రెడ్డి

పాలమూరు వర్సిటీ వీసీగా ప్రొ. రాథోడ్

జేఎన్‌టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డి

జేఎన్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వీసీగా ప్రొ. కవిత దర్యాని

కాకతీయ వర్సిటీ వీసీగా ప్రొ. రమేష్‌

Updated Date - 2021-05-23T00:21:53+05:30 IST