Abn logo
Apr 9 2021 @ 03:10AM

కొండరెడ్ల అభివృద్ధికి కృషి

వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదిమతెగలతో గవర్నర్‌ సంభాషణ 


హైదరాబాద్‌/దమ్మపేట, ఏప్రిల్‌ 8: అడవులు, గుట్టల్లో నివసించే ఆదిమతెగల జాతులైన కొండ రెడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండల కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పూసుకుంట గ్రామ కొండరెడ్లతో గవర్నర్‌ మాట్లాడారు. తమ గ్రామానికి రావాలని కోరటం తో వస్తానని  గవర్నర్‌ హమీ ఇచ్చారు. సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. ఈఎ్‌్‌సఐ ప్రొఫెసర్‌ శివుడు, డాక్టర్లు హరికృష్ణ, రంజిత్‌  గ్రామంలో చేసిన సర్వే వివరాలు వెల్లడించారు. గవర్నర్‌ జాయింట్‌ సెక్రెటరీ జె.భవానీశంకర్‌, జడ్పీటీసీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  


ప్రజావినతులపై స్పందించేలా చర్యలు తీసుకోండి: ఎఫ్‌జీజీ వినతి

ప్రజల వినతులు, న్యాయ స్థానాల తీర్పులపై  ప్రభుత్వం తగు రీతిలో స్పందించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) కార్యద ర్శి ఎం.పద్మనాభరెడ్డి విన్నవించారు. న్యాయస్థానాల తీర్పుల పట్ల, ప్రజల అర్జీల పట్ల ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం వహిస్తోందని, డబ్బు లేనిదే పనికాదు అన్న అనుమానం ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందన్నారు.

Advertisement
Advertisement
Advertisement