సంప్రదాయ కళలు గొప్ప వారసత్వ సంపద: గవర్నర్

ABN , First Publish Date - 2021-08-09T01:50:01+05:30 IST

సంప్రదాయ గిరిజన కళలు ఒక గొప్ప వారసత్వసంపద, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు

సంప్రదాయ కళలు గొప్ప వారసత్వ సంపద: గవర్నర్

హైదరాబాద్: సంప్రదాయ గిరిజన కళలు ఒక గొప్ప వారసత్వసంపద, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.వందల, వేల ఏళ్ల సంస్కృతి, సంప్రదాయాలకు  ప్రతి రూపాలు అయిన ఈ అపురూప కళా సంపదను  కాపాడి, భవిష్యత్ తరాలకు మన చారిత్రక వారసత్వాన్ని అందించాలని గవర్నర్ తమిళిసై వివరించారు.మాదాపూర్ లోని  స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహిస్తున్న  ఎథ్నిక్  ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఈరోజు  గవర్నర్ సందర్శించారు. గిరిజన సంప్రదాయ కళా వస్తువుల ను పేరుపేరునా కనుక్కొని ఆసక్తిగా పరిశీలించారు.అప్పటి కళానైపుణ్యానికి గవర్నర్ ముగ్ధులయ్యారు.ఇవి గొప్ప వారసత్వ సంపద అని,  వీటిని అపురూపంగా కాపాడుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు.


శాశ్వత ప్రాతిపాదికన ఈ కళాఖండాలను కాపాడుకోవడానికి మ్యూజియం ఏర్పాటు కోసం తనవంతుగా ప్రయత్నిస్తానని డాక్టర్ తమిళి సై   హామీ ఇచ్చారు.ఈ  ఆదివాసి, గిరిజన సంపద అమూల్యమైనది అని వాటిని కాపాడుకోవడానికి కొత్త తరానికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.ఆద్య కళ పేరుతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు,  ప్రొఫెసర్ లక్ష్మి ఇతర కళా సేవకులను గవర్నర్ అభినందించారు.వారి  కృషి స్పూర్తిదాయకమనీ, భవిష్యత్ తరాలు వారి సేవలను గుర్తుంచుకుంటాయని గవర్నర్ అన్నారు.

Updated Date - 2021-08-09T01:50:01+05:30 IST