తుపాకీతో బెదిరించి బాలికపై అఘాయిత్యం

ABN , First Publish Date - 2021-01-11T15:34:50+05:30 IST

పొరుగింటి వ్యక్తి తుపాకీతో బెదిరించి బాలికపై అత్యాచారం చేసిన దారుణ ఘట....

తుపాకీతో బెదిరించి బాలికపై అఘాయిత్యం

నోయిడా : పొరుగింటి వ్యక్తి తుపాకీతో బెదిరించి బాలికపై అత్యాచారం చేసిన దారుణ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. గ్రేటర్ నోయిడాలోని రుబూపురా ప్రాంతంలో నివాసముంటున్న ఓ రైతు కుమార్తె తన గదిలో నిద్రపోతుండగా, పక్కింటి వ్యక్తి గోడ పగులగొట్టి వచ్చి నిద్రపోతున్న బాలికకు తుపాకీతో బెదిరించి ఆమెపై అత్యాచారం జరిపాడు. బాలిక అరుపులు విన్న బాధిత బాలిక కుటుంబసభ్యులు నిద్ర లేచి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద కంట్రీ మేడ్ తుపాకీ ఉందని, అతన్ని పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పగించామని బాధితురాలి కుటుంబసభ్యులు చెప్పారు. బాధిత బాలికను ఆసుపత్రి వైద్యులు పరీక్షించగా ఆమెపై అత్యాచారం జరిగిందని తేలింది. గ్రేటర్ నోయిడా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Updated Date - 2021-01-11T15:34:50+05:30 IST