జీఎస్టీ పై నిర్ణయం చేనేత కు జీవం

ABN , First Publish Date - 2022-01-01T21:47:12+05:30 IST

చేనేత రంగం కుదేలవ్వకుండా జీ ఎస్ టీ పెంపు పై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ పద్మశాలి అఫిషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (టీ పోపా) హర్షం వ్యక్తం చేసింది.

జీఎస్టీ పై నిర్ణయం చేనేత కు జీవం

హైదరాబాద్: చేనేత రంగం కుదేలవ్వకుండా జీ ఎస్ టీ పెంపు పై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ పద్మశాలి అఫిషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (టీ పోపా) హర్షం వ్యక్తం చేసింది. శనివారం ఈ మేరకు టీ పోపా ఓ ప్రకటన లో జీఎస్టీ పెంపు నిర్ణయం వెనక్కు తీసుకుని ప్రస్తుత స్థితినే యధా తధాంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ చేనేత రంగం హర్షం వెలిబుచ్చిoదనీ పేర్కొన్నారు. టీ పో పా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండూరి వెంకటేశ్వర్లు, సామల సహదేవ్, సహాధ్యక్షులు శీరందాస్ శ్రీనివాసులు,ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ లు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.కేంద్ర ప్రభుత్వ సానుకూల దృక్పథం ఆహ్వానించదగిన పరిణామమే అని ఆలాగే చేతి వృత్తుపై కూడా జీ ఎస్టీ నీ పూర్తిగా తీసివేయాలన్న రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ డిమాండ్ పై సైతం కేంద్రం ఆలోచించాలని కోరారు.


2015లోనే చేతి వృత్తుల పై జీ ఎస్టీ నీ పూర్తిగా ఎత్తి వేయాలని రాపోలు ఢిల్లీ లో గాంధీ విగ్రహం సాక్షిగా ధర్నా చేసిన సంగతి గుర్తు చేశారు. చేనేత మరియు హస్త కళలను భవిష్యత్ తరాలకు అందించాలంటే  వాటి పై ఎలాంటి టాక్సులు విధించ రాదు. చేనేత ఒక కళ, కళాత్మకత ఉట్టి పడే వస్త్రాల తయారీ కి ఇంటిల్లి పాది కష్ట పడతారు. అయినా కనీస వేతనం గిట్టు బాటు కాదు. వారు తమ కుల వృత్తిని నమ్మి మానవాళికి ఆరోగ్యాన్ని హుందాతనాన్నెచ్చే వస్త్ర ఉత్పత్తులు చేపడుతున్నారు.చేనేత ఇతర వృత్తుల ప్రోత్సహించడానికి కేవలం జీఎస్టీఎత్తివేయడం కాదు ఆ ఉత్పత్తుల కొనే వారికి సబ్సిడీలు ఇవ్వాలి. కళలను, కళాకారులను ప్రోత్సహించాలి. జీఎస్టీఎత్తి వేయడానికి కృషిచేసిన కేటీఆర్, శాసన మండలి సభ్యులు ఎల్ రమణ కు తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా టీ పోపా కృతజ్ఞలు తెలిపింది.

Updated Date - 2022-01-01T21:47:12+05:30 IST