ఆభరణాల రీసేల్‌ లాభాలపైనే జీఎస్‌టీ

ABN , First Publish Date - 2021-07-19T06:19:19+05:30 IST

పాత బంగారు నగల విక్రయంపై జీఎ్‌సటీకి సంబంధించి కర్ణాటక అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఏఏఆర్‌) కీలక తీర్పు వెలువరించింది.

ఆభరణాల రీసేల్‌ లాభాలపైనే జీఎస్‌టీ

స్పష్టం చేసిన ఏఏఆర్‌

బెంగళూరు: పాత బంగారు నగల విక్రయంపై జీఎ్‌సటీకి సంబంధించి కర్ణాటక అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఏఏఆర్‌) కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన పాత బంగారు ఆభరణాలను వ్యాపారులు విక్రయించటం ద్వారా ఆర్జించే లాభాలకు మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని తీర్పులో స్పష్టం చేసింది. ఆభరణాలు విక్రయించే సమయంలో నగ రూపం గానీ, స్వభావం గానీ మార్చకుండా శుభ్రం చేసి మెరుగుపెట్టుకోవచ్చని తెలిపింది. ఆద్య గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ అడిగిన వివరణకు సమాధానంగా ఏఏఆర్‌ ఈ విషయాలు పేర్కొంది. దీంతో నగల వ్యాపారులు అమ్మే పాత నగలపై జీఎ్‌సటీ భారం తగ్గుతుందని నిపుణుల అంచనా. 


గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,328 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికం గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు బాగానే కలిసొచ్చింది. ఈ మూడు నెలల్లో ఇన్వెస్టర్లు ఈ పథకాల్లో నికరంగా రూ.1,328 కోట్లు మదుపు చేశారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం ఇది తక్కువే. గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాల్లో మదుపరులు రూ.2,040 కోట్లు మదుపు చేశారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో వచ్చిన రూ.1,779 కోట్లతో పోల్చినా ఇది తక్కువే. పసిడి ధరలు ఆకర్షణీయంగా ఉన్నందున మున్ముందు కూడా ఈ పథకాల్లో పెట్టుబడులు కొనసాగుతాయని మార్కెట్‌ వర్గాల అంచనా.

Updated Date - 2021-07-19T06:19:19+05:30 IST