గుడివాడ టూ టౌన్ ఎస్ఐ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-19T11:45:51+05:30 IST
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన అపార్ట్మెంటులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ కుమార్ బలవన్మరణానికి వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనుమాన్ జంక్షన్లో విధులు నిర్వహిస్తుండగా బ్యూటీషియన్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో విజయ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఆయనకు మూడు నెలల క్రితం వివాహం కాగా.. భార్యను కాపురానికి తీసుకురాకుండా.. గుడివాడలో బ్యూటీషియన్తో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది.