కన్నవాళ్లు కాదనుకున్న Gujarat చిన్నారిని.. American జంట అక్కున చేర్చుకోబోతోంది..

ABN , First Publish Date - 2021-09-09T01:22:56+05:30 IST

ఆడపిల్లగా పుట్టడమే ఆమె నేరమైంది. భూమిపై పడగానే కన్నవాళ్లు తీసుకెళ్లి చెత్త కుప్పలో వేశారు. అటుగా వెళ్తున్న కొందరు చెత్త కుప్పలోంచి ఆ పసిగుడ్డు ఏడుపు విని అందులోంచి బయటకు తీశారు. గాయాలతో ఉన్న ఆమెను తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. దాంతో ఆ పసిగుడ్డు బతికింది. అనంతం చిల్డ్రన్ హోంకు చేరింది. అక్కడే పెరిగింది.

కన్నవాళ్లు కాదనుకున్న Gujarat చిన్నారిని.. American జంట అక్కున చేర్చుకోబోతోంది..

అహ్మదాబాద్: ఆడపిల్లగా పుట్టడమే ఆమె నేరమైంది. భూమిపై పడగానే కన్నవాళ్లు తీసుకెళ్లి చెత్త కుప్పలో వేశారు. అటుగా వెళ్తున్న కొందరు చెత్త కుప్పలోంచి ఆ పసిగుడ్డు ఏడుపు విని అందులోంచి బయటకు తీశారు. గాయాలతో ఉన్న ఆమెను తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. దాంతో ఆ పసిగుడ్డు బతికింది. అనంతం చిల్డ్రన్ హోంకు చేరింది. అక్కడే పెరిగింది. ఇలా నాలుగేళ్ల క్రితం కన్నవాళ్లు కాదనుకున్న ఆ చిన్నారిని.. ఈరోజు దేశం కాని దేశం వాళ్లు దత్త తీసుకుని అక్కున చేర్చుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు భారత్ నుంచి ఆ చిన్నారి ఏకంగా అమెరికా వెళ్లబోతోంది. గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్ చోటు చేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 


ఆడపిల్ల పుట్టిందనో.. మరేదైనా కారణంగానో తెలియదు కానీ సరిగ్గా కళ్లు కూడా తెరవని ఆ చిన్నారి చెత్తకుప్పకు చేరింది. ఈ అమానుష ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగింది. గాందీనగర్ చెత్త కుప్పలో పసిగుడ్డు ఏడవడం విన్న అటువైపుగా వెళ్లిన కొందరు.. ఆమెను తీసుకెళ్లి దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆ పసిగుడ్డు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వైద్యులు అతికష్టం మీద ఆమెను బతికించారు. అనంతరం ఆ చిన్నారిని అహ్మదాబాద్‌లోని ఓ చిల్డ్రన్ హోంకు అప్పగించారు. అక్కడే ఆ చిన్నారి పెరిగింది. ఆమెకు హోం నిర్వాహకులే అర్పిత అనే పేరు పెట్టారు. అలా నాలుగేళ్లు గడిచిపోయాయి. 


ఇవి కూడా చదవండి..

Chicago: విమానం మిస్ చేసుకున్న మహిళ.. కన్నింగ్‌ ఐడియాతో అధికారులకు చుక్కలు!

Kuwait వెళ్లాలా? ఇంకేందుకు ఆలస్యం లగేజీ సర్దుకోండి!


ఈ క్రమంలో ఇటీవల  చిల్డ్రన్ హోం నిర్వాహకులు అర్పిత పేరును ఆన్‌లైన్ దత్తత కార్యక్రమంలో చేర్చారు. దాంతో అమెరికాలోని నాథన్ థాంమ్సన్ దంపతులు అర్పితను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. తాజాగా చిల్డ్రన్ హోంకు వచ్చిన నాథన్.. అర్పితను కలిశారు. చిన్నారిని తాము దత్తత తీసుకుంటామని నిర్వాహకులతో చెప్పారు. అంతేగాక.. ఆమె పేరును జాయ్‌గా మార్చారు నాథన్. దత్తత ప్రక్రియ పూర్తికాగానే తనతో పాటు అర్పితను తీసుకెళ్తానంటూ నాథన్ తెలిపారు. తాజాగా జిల్లా కలెక్టర్ సందీప్ సాంగ్లె సైతం అర్పిత ఉంటున్న చిల్డ్రన్ హోంను సందర్శించారు. ఈ సందర్భంగా అర్పిత దత్తత విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు నిర్వాహకులు. దాంతో కలెక్టర్ కూడా దత్తత ప్రక్రియ పూర్తికాగానే అర్పితను అమెరికాకు పంపాల్సిందిగా నిర్వాహకులతో చెప్పారు. ఇలా పసిగుడ్డుగా చెత్తకుప్పకు చేరిన అర్పిత.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికా వెళ్లబోతోంది. పేగుబంధం వద్దన్నకున్న ఆమెను.. ప్రేమబంధం అక్కున చేర్చుకోబోతోంది.      




Updated Date - 2021-09-09T01:22:56+05:30 IST