Guntur: తెనాలిలో రౌడీషీటర్ హల్‎చల్

ABN , First Publish Date - 2021-07-31T13:19:15+05:30 IST

తెనాలిలో రౌడీషీటర్ హల్‎చల్ చేశాడు. తెనాలి ముత్తంశెట్టిపాలెం కబేలా వంతెన వద్ద కత్తిపట్టుకుని హంగామా చేశాడు. అంతేకాదు.. మారిస్‎పేటకు చెందిన రవితేజ అనే వ్యక్తిపై ...

Guntur: తెనాలిలో రౌడీషీటర్ హల్‎చల్

గుంటూరు: తెనాలిలో రౌడీషీటర్ హల్‎చల్ చేశాడు. తెనాలి ముత్తంశెట్టిపాలెం కబేలా వంతెన వద్ద కత్తిపట్టుకుని హంగామా చేశాడు. అంతేకాదు.. మారిస్‎పేటకు చెందిన రవితేజ అనే వ్యక్తిపై కత్తితో దాడికి యత్నించాడు. అయితే రౌడీషీటర్‎ను తనపై దాడి చేస్తాడని రవితేజ ముందుగానే పసిగట్టి తప్పించుకున్నాడు. దీంతో రవితేజకు ప్రాణపాయ స్థితిని నుంచి భయటపడ్డాడు. ఈఘటనపై పోలీసులకు రవితేజ ఫిర్యాదు చేశాడు. రౌడీషీటర్‎ను పోలీసులు అరెస్ట్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-31T13:19:15+05:30 IST