Abn logo
Oct 11 2021 @ 02:08AM

హ్యాండ్‌బాల్‌ చాంప్‌ తెలంగాణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సబ్‌ జూనియర్‌ బాలుర హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ను తెలంగాణ జట్టు కైవసం  చేసుకుంది. ఆదివారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ముగిసిన ఫైనల్లో తెలంగాణ 29-26తో రాజస్థాన్‌పై గెలిచింది. ఎమ్మెల్సీ కె. కవిత, జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రావు, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి ట్రోఫీ అందజేశారు.