ఘనంగా హనుమజ్జయంతి

ABN , First Publish Date - 2020-05-18T10:13:04+05:30 IST

ఇరు జిల్లాల్లో ఆదివారం హనుమజ్జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా హనుమజ్జయంతి

నెట్‌వర్క్‌: ఇరు జిల్లాల్లో ఆదివారం హనుమజ్జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అలాగే స్వామి వారికి  నిత్య కల్యాణం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భ ద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, తమలపాకులతో పూజ నిర్వహించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పూజలన్నీ స్వామి వారికి ఏకాంతంగా నిర్వహించారు.


బీఎస్సాఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో..

భద్రాచలంలోని బీఎస్సాఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో హనుమజ్జయంతి సందర్భంగా బూసిరెడ్డి శంకర్‌ రెడ్డి-అన్నపూర్ణ దంపతుల ఆధ్వర్యంలో విశ్వశాంతి హోమం నిర్వహించా రు. కరోనా వ్యాప్తి నశించాలని, ప్రజలందరు సుఖ శాంతులతో చల్లగా ఉండాలని హోమం నిర్వహించినట్లు శంకర్‌రెడ్డి తెలిపారు. తల్లాడ మండలంలోని అంజనాపురం, మల్లవరం, తల్లాడ, నారాయణపురం గ్రామాల్లోని దేవాలయాల్లో ఆంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పెనుబల్లి, వీఎంబంజర్‌లోని ఆలయాల్లో ఆంజనేయస్వామికి నిరాడంబరంగా అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదివారం పెనుబల్లి కోదండరామాల యం అర్చకులు శ్రీరంగం వెంకటాచార్యుల ఆధ్వర్యంలో ఆలయకమిటీ సభ్యులు వేముల కామేశ్వరరావు, సత్యనారాయణ ఆంజనేయస్వామికి పూజలు చేశారు. అభయాంజనేయస్వామి ఆలయంలోనూ అర్చకులు శ్రీనివాసాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ జరిపి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


కారేపల్లి మండలంలో హ నుమాన్‌ జయంతి వేడుకలను అదివారం ఘనంగా జరుపుకున్నారు. దుమ్ముగూడెం మండలపరిధి లక్ష్మీనగరం శ్రీ దాసాంజనేయస్వామి వారి ఆలయంలో ఆదివారం హనుమజయంతి వేడుకలను సాదాసీదాగా నిర్వహించారు. అర్చకులు ఆరుట్ల రాజగోపాలాచార్యులు శాస్త్రోపేక్తంగా పూజలు నిర్వహించారు. సత్తుపల్లిలో ఆదివారం హనుమజ్జయంతి ఉత్సవాలు పలు ఆలయాల్లో నిరాంబంరంగా సాగాయి. కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం ఉత్సవాలను ని క్వాహకులు ముగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మెట్టాంజనేయ ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.  హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే రాములునాయక్‌ ఆదివారం వైరాలోని పలు ఆలయాల్లో పూ జలు నిర్వహించారు. నిరాడంబరంగా పూజా కార్యక్రమా లు జరిగాయి.


మునిసిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఉన్న శ్రీప్రసన్నాంజనేయస్వామి అలాగే అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి విగ్రహానికి ఎమ్మెల్యే పూజలు చేశారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌ పాల్గొన్నారు. నేలకొండపల్లి మండలంలోని హనుమాన్‌ ఆలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు. స్వా మిని సుందరంగా అలంకరించి, నైవేద్యం సమర్పించారు. నేలకొండపల్లి బైరాగుల గుట్ట శ్రీప్రసన్నాంజనేయస్వామి, కొత్తూరు శ్రీఆంజనేయస్వామి, బోదులబండలో స్వామికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.


ఖమ్మం నగరంలో లాక్‌ డౌన్‌ నేపథ్యంతో ఆలయాల్లోకి భక్తుల్ని అనుమతించకుండా స్వామి వారికి ఏకాంతంగా పూజలుఉ నిర్వహించారు.ఖమ్మంలోని పర్ణశాల రామాల యం, గేటు ఆంజనేయస్వామి, బీకే బజార్‌ ఆంజనేయస్వామి, పవనసుత జలాంజనేయ స్వామి, చెర్వు బజార్‌లోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ముర్రెడు ఘా టు సమీపంలోని దాసాంజనేయస్వామి ఆలయంలో  తెల్లవారుజామున 4 గంటలకు అలయ ఆర్చకులు సత్యనారాయణచార్యులు స్వామివారికి పూలమాలలతో ప్రత్యేక అల ంకరణ చేసి సింధూరం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం 108 పర్యాయాలు హనుమాన్‌చాలీసా పారాయణం, తమలాకులతో విశేషపూజలు నిర్వహించా రు. గణే్‌షటెంపుల్‌లో స్వామివారికి ప్రత్యేక పూజలు, హ నుమంతుడి సువర్చల కల్యాణం నిర్వహించారు. పాండురంగాభజనమందిరంలో సింధూరాభిషేకాలు చేశారు.

Updated Date - 2020-05-18T10:13:04+05:30 IST