హ్యాపీ మొబైల్స్‌.. హ్యాపీ డేస్‌ 2021 ఆఫర్లు

ABN , First Publish Date - 2021-04-07T05:42:46+05:30 IST

హ్యాపీ మొబైల్స్‌.. తన మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘హ్యాపీ డేస్‌ 2021’ పేరుతో

హ్యాపీ మొబైల్స్‌.. హ్యాపీ డేస్‌ 2021 ఆఫర్లు

హైదరాబాద్‌: హ్యాపీ మొబైల్స్‌.. తన మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘హ్యాపీ డేస్‌ 2021’ పేరుతో వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టిన హ్యాపీ మొబైల్స్‌.. ప్రస్తుతం 70 స్టోర్లతో కార్యకలాపాలు సాగిస్తోందని సంస్థ సీఎండీ కృష్ణ పవన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోట సంతోష్‌ వెల్లడించారు. అంతేకాకుండా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసిందని తెలిపారు.


కాగా హ్యాపీ మొబైల్స్‌ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఎలాంటి లక్కీ డ్రాలతో సంబంధం లేకుండా ప్రతి వినియోగదారుడికి ఆఫర్‌ ప్రయోజనాలను అందించనున్నట్లు చెప్పారు. హ్యాపీ డేస్‌ సీజన్‌లో భాగంగా రూ.3 కోట్ల విలువైన బహుమతులను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపారు. తమ స్టోర్లలో 300కు పైగా మోడల్స్‌, 500కు పైగా రకాల యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు. 




వార్షికోత్సవ ఆఫర్లు


 ఐసీఐసీఐ, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ కార్డులపై అత్యధికంగా 10 శాతం వరకు తక్షణ క్యాష్‌బ్యాక్‌


 ఈఎంఐలపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ సదుపాయం


 అన్ని ప్రముఖ బ్రాండ్ల కొనుగోలుపై క్యాష్‌ బ్యాక్‌


 లాప్‌టాప్‌, ఎల్‌ఈడీ టీవీలపై 10 శాతం వరకు తగ్గింపు 


 మొబైల్స్‌ మార్పిడిపై ప్రత్యేక ఆఫర్లు


 అన్ని మొబైల్‌ యాక్సెసరీ్‌సపై 50 శాతం వరకు తగ్గింపు 


 ఐఫోన్‌, సామ్‌సంగ్‌, ఒప్పో, వివో, వన్‌ ప్లస్‌, రియల్‌మీ సహా మరెన్నో బ్రాండ్లపై భారీ రాయితీలు


Updated Date - 2021-04-07T05:42:46+05:30 IST