Abn logo
Oct 21 2021 @ 22:24PM

ఫ్రస్ట్రేషన్‌లో ఈటల నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు: హరీష్‌రావు

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. ఈటలకు ఓటమి భయం పట్టుకుందని, ఫ్రస్ట్రేషన్‌లో ఈటల నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్, అర్వింద్ గొప్పలు చెప్పుకుంటున్నారని హరీష్‌రావు అన్నారు. పసుపు బోర్డు తెస్తా అని మోసం చేసిన వ్యక్తి మాటలను ప్రజలు నమ్మరని మంత్రి హరీష్‌రావు తెలిపారు.